- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్‌లో రాహుల్ ఎన్నికల ర్యాలీలు రద్దు
న్యూఢిల్లీ : కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌లో తదుపరి మూడు దశలకు గాను జరగనున్న ఎన్నికల ప్రచార ర్యాలీలను ఆయన రద్దు చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బెంగాల్‌లో నేను పాల్గొనదలచిన ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేసుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా వారి ప్రచారాన్ని రద్దు చేసుకోవాలని నేను సూచిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని, మిగతా నాయకులు కూడా ఇది పాటించాలని కోరుతున్నారు. ఇక బెంగాల్ మంత్రి, టీఎంసీ నాయకుడు సొబ్హన్‌దేవ్ ఛటోపాధ్యాయ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. భవానీపూర్ (అంతకుముందు బెంగాల్ సీఎం దీదీ నియోజకవర్గం) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆదివారం నిర్వహించ తలపెట్టిన ర్యాలీని క్యాన్సిల్ చేశారు.