కరోనాకు రహానే రూ.10లక్షల విరాళం

by Shamantha N |
కరోనాకు రహానే రూ.10లక్షల విరాళం
X

కరోనా వైరస్ మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో.. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రముఖ వ్యాపార వెత్తలు, సినీ హీరోలు, క్రీడాకారులు సైతం దేశంలోని పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఆదివారం రూ. 10 లక్షలు విరాళమిచ్చాడు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) ప్రకటించింది. స్టార్‌ ప్లేయర్లకు దీటుగా వర్ధమాన క్రీడాకారులు కూడా ఉదారతను చాటుకున్నారు.

Tags : cricketer Rahane, donation, Rs.10lakh, corona victims, mumbai

Advertisement

Next Story