వాళ్లు ఢిల్లీ వెళ్లడం వేస్ట్: రఘురామకృష్ణం రాజు

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీలు తనపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడం వృథా ప్రయాసే అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, తనపై విమర్శల దగ్గర్నుంచి షోకాజ్ నోటీసుల వరకు జరిగిన తతంగమంతా సీఎం జగన్‌కు తెలియకుండా జరుగుతుందని భావించానని, అయితే ప్రత్యేక విమానంలో ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తున్నారంటే సీఎం కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని స్పష్టమైందని తెలిపారు.

అయితే వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడం ప్రజాధనం వృథా చేయడమేనని అన్నారు. తానింత వరకు పార్టీకి కానీ, పార్టీ అధినేతకు కానీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను లేవనెత్తిన అంశాలకు పార్టీకి ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలియడం లేదని అన్నారు. ఢిల్లీలో బాలశౌరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూస్తానని ఆయన చెప్పారు.

ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే సస్పెండ్‌ చేస్తే పార్లమెంట్‌లో ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఉండరని అన్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ ఢిల్లీ ప్రయత్నాలు విరమించుకోవాలని ఆయన సూచించారు. వెంకన్న భూములు అమ్మొద్దని చెబితే అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. వెంకటేశ్వరస్వామి దయతో అగ్నిపునీతుడినవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story