హైకోర్టుకు చేరిన ఆర్ఆర్ఆర్ లొల్లి

by srinivas |
MP Raghurama krishnamraju
X

దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎస్సార్సీపీ రాజకీయ విభేదాలు హైకోర్టుకు చేరాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలో తనపై నమోదవుతున్న కేసులను కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ లో కోరారు.

నరసాపురం పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులంతా వివిధ పోలీస్ స్టేషన్లలో వరుసగా పోలీసు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారని, తమ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని, ఆయనపై చర్యలు
తీసుకోవాలని కోరుతూ, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి వెంకటనాగేశ్వరావులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story