ఏంట్రా మన ఖర్మ అంటున్న విజయ్ సేతుపతి-జయరాం!

by Jakkula Samataha |   ( Updated:2023-12-16 16:40:39.0  )
ఏంట్రా మన ఖర్మ అంటున్న విజయ్ సేతుపతి-జయరాం!
X

దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా సైన్ చేస్తే చాలు.. ఆ మూవీ తప్పక చూడాల్సిందే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. జయరాం, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన ‘మార్కోని మాథై’ మలయాళ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మూవీని ప్రజెంట్..తెలుగులో డబ్ చేస్తున్నారు. తాజాగా ఆ సినిమాలోని ‘ఏంట్రా మన ఖర్మ’ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని మేకర్స్ తెలిపారు. సనీల్ కలాథిల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని తెలుగులో..లక్ష్మీ చెన్నకేశవ ఫిల్మ్స్ బ్యానర్‌పై టాకీసుల్లో రిలీజ్ చేయనున్నారు. సాంగ్ టీజర్‌లో మక్కల్ సెల్వన్ సేతుపతి, విలక్షణ నటుడు జయరాం తమదైన స్టైల్లో చిందులు వేస్తూ అలరించగా..చిత్రానికి జయచంద్రన్ మ్యూజిక్ అందించారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంలో తనదైన విలనిజంతో విజయ్ సేతుపతి ప్రేక్షకుల మది దోచుకుంటున్నారు. జయరాం తెలుగులో ‘భాగమతి’ ‘అలవైకుంఠపురంలో’ చిత్రాల్లో మంచి పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed