అలాంటి పనులు చేస్తే కోర్టుకు ఈడుస్తా : రాధిక

by Jakkula Samataha |
అలాంటి పనులు చేస్తే కోర్టుకు ఈడుస్తా : రాధిక
X

దిశ, సినిమా : సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే కొవిడ్‌తో పోరాడాల్సి వస్తోందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో సీరియస్‌గా రియాక్ట్ అయింది రాధిక. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘నా మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నాక.. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నా, ఇప్పుడు బాగున్నాను. వర్క్‌లో బిజీ అయిపోయాను. నా హెల్త్‌పై అనవసరంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని కోర్టుకు ఈడుస్తా’ అని ట్వీట్ చేసింది రాధిక. కాగా చెక్ బౌన్స్ కేసులో రాధికతో పాటు భర్త శరత్ కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story