ప్రభాస్ సినిమా పై క్లారిటీ.. కృష్ణాష్టమి స్పెషల్ గా ‘రాధేశ్యామ్’

by Anukaran |
radesyam
X

దిశ, సినిమా : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభాస్, పూజా హెగ్డే అప్‌కమింగ్ మూవీ ‘రాధేశ్యామ్’ నుంచి న్యూ పోస్టర్ రిలీజైంది. పూజ పియానో వాయిస్తుండగా, ప్రభాస్ తననే చూస్తున్న కూల్ ఫొటోలో ఆమె వెనక నెమలి పింఛాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పిక్చర్‌ను పోస్ట్ చేసిన పూజా హెగ్డే ‘జన్మాష్టమి వేడుకల సందర్భంగా విక్రమాదిత్య, ప్రేరణను.. ప్రేమకు కొత్త భాష్యాన్ని చెప్పనివ్వండి, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు’ అని తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న మూవీని జనవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ గత జులైలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. కాగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో పాటు పవన్ కల్యాణ్, రానా రీమేక్ మూవీ కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్, ఆదిపురుష్’ షూటింగ్స్‌తో బిజీగా ఉండగా.. పూజ తమిళ్‌లో విజయ్ ‘బీస్ట్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది.

Advertisement

Next Story