- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా చికిత్స కోసం ఇళ్లు ఇచ్చేస్తా : పార్థిబన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా జనజీవనం స్తంభించగా ఇతరులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తి, నితిన్, వివి వినాయక్ లాంటి ప్రముఖులు లక్షల్లో విరాళాలు అందించారు. ప్రకాశ్ రాజ్, రాజశేఖర్‌లు కూడా తమ వంతు సాయాన్ని అందించారు. ఈ క్రమంలో తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తానని అంటున్నారు తమిళ నటుడు రాధాకృష్ణన్ పార్తిబన్. కరోనా వైద్య సేవల కోసం తన ఇల్లును ఇచ్చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు.
కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ… ఎప్పుడూ అదే ధ్యాసలో భయపడాల్సి వస్తుందన్నారు పార్తిబన్. ఈ సమయంలో ప్రతీ ఒక్కరు కరోనాను నిర్మూలించేందుకు ముందుకు రావాలని కోరారు. కరోనా ప్రభావంతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు మన ఇళ్లనే ఆస్పత్రులుగా మార్చి సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. రెండు ఫ్లాట్లు ఉన్న వారు ఒక్క ఫ్లాటు కరోనా చికిత్స కోసం కేటాయించాలని కోరారు. తనకున్న మూడు ఇళ్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తద్వారా ప్రభుత్వానికి సహకరించినట్లు అవుతుందని… వ్యాధి నివారణకు మన వంతు సహాయం అందించినట్లు అవుతుందన్నారు పార్తిబన్.
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు సామాజిక దూరం తప్పకుండా పాటించాలన్న పార్తిబన్… బలమైన బంధాలు మరింత బలపడాలన్న దూరం అవసరమే అని అభిప్రాయపడ్డారు.
Tags: CoronaVirus, Covid 19, RadhaKrishnan Parthiban