- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎడారి దేశానికి మాధవన్.. విమానంలో సోలో జర్నీ
దిశ, సినిమా : యాక్టర్ మాధవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ వీడియోతో షాక్ ఇచ్చాడు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలు షేర్ చేసిన మ్యాడీ.. పాండమిక్ టైంలో ప్యాసింజర్స్ లేని విమానంలో ఒక్కడే ప్రయాణించిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫస్ట్ వీడియోలో ఫ్లైట్‌లో ఒక్కరు కూడా లేకపోగా, కేవలం ఫ్లైట్ అటెండెంట్ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. సిబ్బంది తప్ప ఎవరూలేని విమానంలో జర్నీ ఎక్స్‌పీరియన్స్‌ను వీడియో ద్వారా వివరించిన మాధవన్.. ‘నా జీవితంలో నిజంగా ఇది ఒక ప్రత్యేక క్షణం’ అంటూ బిజినెస్ క్లాస్‌లోకి ఎంటర్ అయ్యాడు. అయితే అందులో కూడా ప్యాసింజర్స్ లేకపోవడం విశేషం. అంతేకాదు ఎయిర్‌పోర్ట్ లాంజ్, వెయిటింగ్ రూమ్స్ కూడా ఖాళీగా ఉండటాన్ని మరొక వీడియోలో చూపించాడు. ఇది జూలై 26న చిత్రీకరించినట్టు తెలుస్తుండగా.. ఈ జర్నీ కొంచె ఫన్నీగా, మరికొంచెం విచారంగా ఉందని తెలిపాడు మాధవన్. ప్రస్తుతం ‘అమెరికి పండిట్’ షూటింగ్ నిమిత్తం తను దుబాయిలో ఉన్నట్టు వెల్లడించాడు.