విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి.. ఆర్ కృష్ణయ్య డిమాండ్

by Shyam |
విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి.. ఆర్ కృష్ణయ్య డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెరిగిన ధరలకు అనుగుణంగా గురుకులాల, కళాశాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు సమీపంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుతారు. కానీ విద్యార్థులకు మెస్ చార్జీలు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. 8 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.1500 నుంచి 3 వేలు, పాఠశాల విద్యార్థులకు 1100 నుంచి 2 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలు 3500 కోట్లు వెంటనే మంజూరు చేయాలని, కళాశాల విద్యార్థులకు సంవత్సరానికి 20వేల స్కాలర్ షిప్ , బీసీ జనాభా ప్రకారం అదనంగా మరో 240 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ స్టైఫండ్ మంజూరు చేయాలని, పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, దాసు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed