- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్‌తో మానసిక ఒత్తిడి.. అధిగమించడం ఎలా?
దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచంలో ఐదో వంతు మానవాళి ఇంటికే పరిమితమైపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐసోలేషన్‌లో బతుకుతున్నారు. దాదాపు 1.3 బిలియన్ల భారతీయులు మూడు వారాల పాటు ఇళ్లకే పరిమితం కానున్నారు. వారి జీవితాల్లో వచ్చిన ఈ అనూహ్య పరిణామం కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే కారణముంది. దీనిని ఎదుర్కోవడానికి మానసిక నిపుణులు కొన్ని సలహాలు సూచనలు అందిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
సమస్య గురించి మాట్లాడండి
అందరి ఇళ్లలోనూ ఒకేలా ఉండదు. కొంతమందికి ఒంటరిగా ఉండటం ఇష్టం. మరికొంతమందికి అసలు ఇంట్లో ఉండటమే ఇష్టం ఉండదు. ఇక కొందరైతే ఓవర్ థింకింగ్ సమస్యతో బాధపడుతూ మనస్తాపానికి గురవుతారు. ఇలా సమస్య ఏదైనా దాని గురించి దగ్గరి వాళ్లతో చర్చిస్తే బాగుంటుంది. దగ్గరగా ఉన్నవారితో చెప్పుకోవడం ఇష్టం లేకపోతే దూరంగా ఉన్న మిత్రులతో ఫోన్ కాల్ ద్వారా పంచుకోవాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. వారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
సామాజిక దూరం, భౌతిక దూరాలకు చాలా తేడా
కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే వ్యాధి వ్యాపించకుండా పాటించాల్సింది భౌతిక దూరం మాత్రమే. భౌతికంగా దూరంగా ఉండి కూడా సామాజిక దూరాన్ని తగ్గించుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది పక్కింటి వాళ్లతో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. దూరంగా ఉండి మాట్లాడటంలో పోయేది ఏం లేదు. మానసికంగా బలంగా ఉన్నవారు ఏదో ఒక విధంగా ఈ క్వారంటైన్ ఒంటరితనాన్ని జయించగలరు. కానీ నిన్న మొన్నటి వరకు స్నేహితులతో, సహోద్యోగులతో ఆనందంగా గడిపి ఒక్కసారిగా పొద్దట్నుంచీ సాయంత్రం వరకు చూసిన ముఖాలనే చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కాబట్టి వీడియోకాల్స్, మెసేజ్‌ల ద్వారా స్నేహితులకు దగ్గరగా అనుభూతి పొందొచ్చు.
లాక్‌డౌన్‌ని తప్పుగా అర్థం చేసుకోవద్దు
లాక్‌డౌన్ గురించి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోరకంగా ఉంటాయి. కానీ అందరి ప్రయోజనం కోసమే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయన్న అంశాన్ని గ్రహించాలి. అంతే తప్ప, లాక్‌డౌన్ వల్ల వ్యాధి రాకుండా ఆగుతుందా? అని ఎదురు ప్రశ్నించడం తప్పు. ఓ అధ్యయనం ప్రకారం సకాలంలో లాక్‌డౌన్ అమలు చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇండియాలో మారణహోమం జరిగి ఉండేదని తేలింది.
ఇక మరికొందరు మాత్రం లాక్‌డౌన్‌ని మరీ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇది కూడా తప్పే. లాక్‌డౌన్ పేరు చెప్పి గ్రామాల్లో రాకపోకలు రాకుండా ముళ్లకంపలు అడ్డుపెడుతున్నారు. అయితే నిజంగా ఆరోగ్య ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటి? అందుకే లాక్‌డౌన్‌ని మరీ తేలికగా తీసుకోవడం, మరీ సీరియస్‌గా తీసుకోవడం రెండూ తప్పే.
తప్పుడు సమాచారంతో జాగ్రత్త
కరోనా పాండమిక్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్ఫోడెమిక్ అని సంబోధించింది. తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లలో ఫార్వర్డు చేసి భయాన్ని మరింత పెంచుతున్నారు. అందుకే ఏదన్నా సమాచారాన్ని పంపడానికి ముందు, దాన్ని అధికారిక సమాచారంతో సరిపోల్చుకోవాలి. తర్వాతే దాన్ని ఇతరులకు పంపించాలి. తప్పుడు సమాచారం కారణంగా మానసికంగా బలంగా లేనివాళ్లు తీవ్ర ఆందోళనకు గురై ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Tags: COVID 19, Corona, Social distance, Physical distance, Wrong Information, Infodemic