క్వాలిటీ షాపులో క్వాలిటీ లేని చికెన్

by Sumithra |
క్వాలిటీ షాపులో క్వాలిటీ లేని చికెన్
X

దిశ, కోదాడ: ఆ చికెన్ షాపు పేరే క్వాలిటీ. కానీ షాపులో దొరికే చికెన్‌లో క్వాలిటీ లేదు. ఏకంగా చనిపోయిన కోళ్లను చికెన్ ప్రియులకు అంటగడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ఘటన కోదాడ పట్టణంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్ణణంలోని క్వాలిటీ చికెన్ షాపు నిర్వహాకులు జేబులు నింపుకునేందుకు అక్రమానికి తెరలేపారు. నిత్యం ఆ షాపుకు వచ్చే కస్టమర్లకు చనిపోయిన కోళ్లు, కుళ్లిన మాంసం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయం కాస్తా మునిసిపాలిటీ అధికారులకు తెలియడంతో గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. షాపులో కుళ్లిపోయిన మాంసం, చనిపోయిన కోళ్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో సదరు షాపును సీజ్ చేయడమే కాకుండా నిర్వహకులపై కేసు నమోదు చేశారు. పట్టణంలో ఇటువంటి మాంసాన్ని ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story