జియో ఫైబర్‌లో పెట్టుబడులకు సిద్ధంగా ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ

by Harish |
జియో ఫైబర్‌లో పెట్టుబడులకు సిద్ధంగా ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియోలో పెట్టుబడుల వరద ఇంకా కొనసాగుతుండగానే, జియో ఫైబర్‌లో పెట్టుబడుల అంశంపై కంపెనీ దృష్టి సారించింది. తాజాగా దోహా కేంద్రంగా పనిచేసే ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(క్యూఐఏ) కంపెనీ జియో ఫైబర్‌లో భారీగా పెట్టుబడులను పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ అయిన జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో క్యూఐఏ సుమారు రూ. 11,200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది.

ఈ ఒప్పందం గురించి సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కిట్స్, మొయిల్స్ అండ్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతోంది. గతేడాది కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు నేతృత్వంలోని కన్సార్టియం, రిలయన్స్ టెలికాం టవర్ ఆస్తులను కలిగిన ఇన్విట్‌లో రూ. 25,215 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. 2019లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డీమెర్జ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల నెట్‌వర్క్ ఉన్న జియో డిజిటల్ ఫైబర్‌ను 11 లక్షల కిలోమీటర్ల పరిధికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed