- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాజ్‌మహల్ సందర్శనలో కొండచిలువ..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ వింతల్లో ఒకటైన ఇండియాలోని తాజ్‌మహల్ సందర్శకు ఏటా లక్షల మంది వస్తుంటారు. యుమున నది ఒడ్డున గల తాజ్ కట్టడాన్ని ప్రేమికుల చిహ్నంగా భావిస్తుంటారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా అద్భుతమైన పాలరాతి కట్టడాన్ని వీక్షించడానికి వచ్చిన సందర్శకులు ఎక్కడికక్కడ భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. కారణం తాజ్ ఎంట్రన్స్ వద్ద ఐదు అడుగుల ఇండియన్ రాక్ ఫైథాన్(కొండచిలువ) సంచరించడమే.
సమాచారం అందుకున్న ఆగ్రా వైల్డ్‌లైఫ్ SOS సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. తాజ్ మహల్ ప్రాంగణం నుంచి స్మారక చిహ్నం టికెట్ కౌంటర్ వద్ద సంచరిస్తున్న కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం కొన్ని గంటల పాటు దానిని పరిశీలనలో ఉంచారు. ఆ తర్వాత ఎప్పటిలాగే సరిసృపాలు తిరిగే సహజ ఆవాసాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సాస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఏళ్లుగా మేము అనేక సరీసృపాలు మరియు పక్షులను తాజ్ మహల్ ప్రాంగణం నుండి రక్షిస్తున్నామని తెలిపారు. అయితే, అప్పుడప్పుడు పర్యాటకుల వలే పక్షులు, సరిసృపాలు కూడా తాజ్ అందాలను వీక్షించడానికి వస్తుంటాయని అధికారి చమత్కరించారు.