- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD అప్డేట్.. 19న కోదండ రామాలయంలో ఏకాంత పుష్పయాగం
దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 19వ తేదీన కొవిడ్-19 నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది.
ఏప్రిల్ 19న ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయంలోనే ఊరేగించనున్నారు.
శ్రీ కోదండరామాలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.