- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దయచేసి కరోనాను సిల్లీగా తీసుకోవద్దు : పూరి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చేస్తున్న సూచనలను దయచేసి సిల్లీగా మాత్రం తీసుకోవద్దని కోరాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని దేశానికి సేవ చేసే చాన్స్ వచ్చింది… ఈ చాన్స్‌ను వదులుకోవద్దని సూచించాడు. గతంలో స్పానిష్ ఫ్లూ, ప్లేగు, మలేరియా లాంటి వ్యాధులు విలయ తాండవం చేసినప్పుడు ప్రపంచంలో కొన్ని లక్షల మంది చనిపోయారని.. వాటితో పోలిస్తే కరోనా మరణాలు ఇప్పటి వరకు తక్కువ నమోదయ్యాయని తెలిపాడు. కానీ ఇప్పుడే దీన్ని కట్టడి చేయలేకపోతే ఇంతకు ముందు వచ్చిన వ్యాధుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య కన్నా.. డబుల్ ట్రిపుల్ మరణాలు నమోదవుతాయని హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించాలని ప్రభుత్వాలను కోరాడు పూరి. అమెరికా, ఫ్లోరిడా, స్పె యిన్, ఇటలీ లాంటి దేశాల్లో ఎనిమిది వారాల పాటు లాక్ డౌన్ చేశారని తెలిపారు. కానీ మనదేశంలో లాక్ డౌన్ అంటే ఏంటో కొంతమంది ప్రజలకు అర్ధం కావడం లేదని… దీనిపై పూర్తిగా అవగాహన తీసుకురావాలని కోరారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా చేసిన సేవలకు గాను జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎవరి గుమ్మంలో వారు నిల్చుని చప్పట్లు కొట్టి అభినందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి కోరితే… కొందరు ర్యాలీలు చేశారని… అంటే ఇంకా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పూరీ. వైరస్‌లన్నీ సిటీలోనే పుడుతున్నాయి.. అడవిలో పుట్టవు.. కారణం అడవిలో జంతువులు ప్రకృతికి అనుగుణంగా బతుకుతున్నాయి.. మనుషులు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా కరోనా గురించి ప్రభుత్వం అందిస్తున్న సూచనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేయరాదని కోరాడు పూరి. అప్పుడే ప్రశాంత జీవనం నెలకొంటుందని సూచించాడు.
Tags: Director, Puri Jagannadh, CoronaVirus, Covid19