జమ్ములో వినూత్న దండన

by Shamantha N |
జమ్ములో వినూత్న దండన
X

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 14 వరకు ప్రజలు ఎట్టిపరిస్థితిలో గడప దాటి బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే, మొదటి రోజే జమ్ములోని ఓ ప్రాంతంలో ప్రజలు బాధ్యత మరచి నిర్లక్ష్యంగా రోడ్లపై గుమిగూడటం, తిరగడం వంటివి చేశారు. అక్కడి పోలీసులు వారిపై వినూత్న చర్యలు తీసుకున్నారు. వారిని రోడ్డుపైనే సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వలయాలు​​ గీసి అందులోనే కదలనివ్వకుండా కూర్చోబెట్టారు.

Tags : corona out break, lock down, jammu kashmir, punishment for those who violate the regulations

Advertisement

Next Story