బ్లీ టీవీ.. డెఫ్ పీపుల్ వర్చువల్ వరల్డ్

by Anukaran |
బ్లీ టీవీ.. డెఫ్ పీపుల్ వర్చువల్ వరల్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 2018 లెక్కల ప్రకారం..ఇండియాలో 63 మిలియన్ల ప్రజలు ‘హియరింగ్ లాస్’(వినికిడి లోపం)తో బాధపడుతున్నారు. ఈ లోపం వల్ల చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్‌కు దూరమవుతున్నట్లుగా పలు అధ్యయనాల్లో తెలియగా..ఈ సమస్యకు టెక్నాలజీ ఇంటర్‌వెన్షన్స్‌తో పుణెకు చెందిన ‘బ్లీటెక్ ఇన్నోవేషన్స్’ అనే స్టార్టప్ పరిష్కారం చూపుతోంది.

పుణేకు చెందిన జాహ్నవి జోషి, నుపుర్ కిర్లోస్కర్‌..2015లో ‘బ్లీటెక్ ఇన్నోవేషన్స్’ ప్రారంభించి, డెఫ్ కమ్యూనిటీ కోసం స్మార్ట్ వాచ్ తీసుకొచ్చారు. చెవిటివాళ్లు వైబ్రేషన్స్ సాయంతో సంగీతం ఆస్వాదించేలా ఈ ప్రొడక్ట్ డిజైన్ చేశారు. ఈ సమయంలోనే హియరింగ్ ఇంపెయిర్‌మెంట్స్ వల్ల ఇబ్బందులున్నాయని, ప్రధానంగా హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో వీళ్లకు సమస్యలున్నాయని జాహ్నవి, నుపుర్‌కు అర్థమైంది. ఇండియాలో చాలా స్కూల్స్‌లో వీరికి స్పీచ్ థెరపీ, లిప్ రీడింగ్ వంటి ఓరలిజమ్ సాయంతో పాఠాలు చెబుతున్నారు. కానీ, వారికి ఈ పద్ధతుల ద్వారా లెస్సన్స్ పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన జాహ్నవి, నుపుర్‌.. వారికి ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యేలా పాఠాలు చెప్పాలంటే ‘ఇండియన్ సైన్ లాంగ్వేజ్’ (ఐఎస్ఎల్) బాగా ఉపయోగపడుతుందని ఆలోచించి.. ‘బ్లీ టీవీ’ని ప్రారంభించారు.

ఇదో వెబ్ పోర్టల్..ఆండ్రాయిడ్ యాప్‌గానూ అభివృద్ధి చేశారు. ఇందులో న్యూస్, ఫైనాన్షియల్ లిటరసీ, కరెంట్ ఎఫైర్స్, మోరల్ స్టోరీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సెల్ఫ్ హెల్ప్ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన బోలెడు వీడియోలు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 12 వేల మంది డెఫ్ పీపుల్ దీన్ని ఉపయోగించుకోగా, అందులో 1,200 మందిచిన్నారులు ఉన్నారు. దాదాపు 100 మంది టీచర్స్ ఇందుకోసం పనిచేస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా బ్లీ టీవీ లైబ్రరీని కూడా ప్రారంభించారు.

Advertisement

Next Story