పునీత్‌ రాజ్‌కుమార్‌కు గుండెపోటు.. హుటాహుటిన ఆసుపత్రికి కర్ణాటక సీఎం

by Shamantha N |   ( Updated:2021-10-29 04:16:46.0  )
Puneet Rajkumar, CM Basavaraj Bommai
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌంట్లు చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం. కాగా, పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. తాజాగా.. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతేగాకుండా.. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని వేడుకుంటున్నారు.

సినీ ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

Advertisement

Next Story