ప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్లు

by Shyam |
ప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: నగరంలో పారిశుధ్యం పెద్ద సమస్యగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, మూత్ర విసర్జనతో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతోంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదుగుతున్న మనం ఇలాంటి చిన్నచిన్న కారణాలతో చులకన కావొద్దంటూ ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‎ను శుభ్రంగా ఉంచేందుకు జరిమానాలు విధిస్తున్నా.. ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. మరోవైపు కోటి జనాభా దాటిన నగరంలో సరిపోయేన్ని టాయిలెట్లు లేవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రణాళికలు ప్రకటించారు. ఇకపై పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుంటామని ఆయన అసెంబ్లీాలో ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని మూడు నెలల్లోనే పూర్తి చేసేవిధంగా ప్రజాప్రతినిధులను ఆదేశించామని ఆర్థిక శాఖ మంత్రి వివరించారు. తడి, చెత్త సేకరణ, రవాణా కోసం అన్నిపట్టణాలను వాహనాలను సమకూర్చామన్నారు. డంపింగ్ యార్డ్‎ల కోసం స్థలాలను గుర్తించామన్నారు. వైకుంఠ ధామాలు, ఆటస్థలాలు, సమీకృత మార్కెట్లు, ఓపెన్ జిమ్‎లు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు.

tag:minister harish rao, assembly, budget, public toilets

Advertisement

Next Story