- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర- బండి సంజయ్
దిశ, శంకర్‌పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉద్ఘాటించారు. మొయినాబాద్ మండలంలో బుధవారం రెండో రోజు యాత్ర కొనసాగింది. కేతిరెడ్డిపల్లి చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో రోడ్డు మీద వెళుతున్న బస్సు ప్రయాణికులతో కండక్టర్, డ్రైవర్‌తో ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా ముందుకు సాగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు రుణమాఫీ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు లేక గన్ని బ్యాగుల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వస్తే, రైతులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్లప్రకాష్, మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి మధుసూదన్‌రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.