పీయూ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

by Shyam |
పీయూ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
X

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించాల్సిన సెమిస్టర్‌ పరీక్షలు అన్నీ వాయిదా వేసినట్టు పీయూ రిజిస్ట్రార్ ఆచార్య పవన్ కుమార్, పరీక్షల అధికారి కుమారస్వామీ తెలిపారు. ఇప్పటికే డిగ్రీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీతో పరీక్ష రుసుం చెల్లించే గడువు కూడా ముగిసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెల్లించిన విద్యార్థుల రుసుంను డిపాజిట్‌ చేయాలని కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు వచ్చిన తరవాత పరీక్షలు నిర్వహించే తేదీలతోపాటు రుసుం చెల్లించేందుకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ మూడో వారంలో డిగ్రీ సప్లిమెంటరీ, నాలుగో వారంలో రెగ్యులర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కళాశాలల్లో పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు. ఇక ఫార్మసీ, బీఈడీ, పీజీ కోర్సులకు సంబంధించిన పరీక్షలను సైతం వాయిదా వేయాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కళాశాలల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాలకు చెందిన అధిపతులతో సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Tags: PU semisters postpone, register,ofter lack down,To deposit student fees

Advertisement

Next Story

Most Viewed