- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాలు చూడొద్దు..వచ్చిన ధరకే అమ్మేయండి!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కీలకమైన సూచనలు ఇచ్చారు. పెద్ద మొత్తంలో అమ్ముదుపోకుండా, ఎటువంటి లాభాంలేని ఇళ్లను నష్టం లేకుండా రియల్టర్లు అమ్మడానికి మొగ్గు చూపాలని, అలాగైతే మీపై వడ్డీ రేట్ల భారం మీపై ఉండదని, నగదు లభ్యత కూడా పెరుగుతుందని కేంద్రమంత్రి చెప్పారు. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇక, కరోనా కారణంగా ఇది మరింత నష్టాన్ని చూడాల్సి వస్తోంది. ఇళ్లు అమ్ముడుపోవడంలేదు, వడ్డీలు మాత్రం పెరిగిపోయి రియల్టర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్‌కో) ఏర్పాటు చేసిన వెబ్ సమావేశంలో… వడ్డీ భారం పడకుండా..నగదు లభ్యత పెంచే విధంగా ఇళ్లను, ప్లాట్‌లను వాస్తవ ధరకే అమ్ముకోవాలని నిర్మాణ రంగంలోని సంస్థలకు సూచనలు ఇచ్చారు. లాభనష్టాలు లేకుండా ఇప్పటివరకూ అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లను, ప్లాట్‌లను విక్రయించాలన్నారు. కరోనా వల్ల ఆర్థికవ్యవస్థ కష్టంలో ఉన్నందున లాభాల కోసం చూడొద్దని, మీరు పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుని విక్రయాలకు సిద్ధం కండని నితిని గడ్కరి సలహా ఇచ్చారు.
రియల్టీ రంగం కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైందని, డిమాండ్ మరింత తగ్గిందని గడ్కరీ తెలిపారు. రియల్టర్లు తమ ప్రతినిధులను గృహ నిర్మాణ, ఆర్థిక శాఖ, ప్రధాని కార్యలయానికి పంపి కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి సలహాలను సూచించాలని, అలాగే మీకున్న సమస్యలను కూడా చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే రియల్టర్లు డిమాండ్ పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఇదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం సహా వ్యాపారాలు విస్తరించడానికి తగిన ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆటో ఇండస్ట్రీస్ మాదిరి రియల్టర్లు డిమాండ్ పెంపొందించేందుకు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల తక్కువ వడ్డీతో రుణాలు వస్తాయి, బ్యాంకుల మీద ఆధారపడటం తగ్గించుకునే అవకాశముందని గడ్కరి వివరించారు. ఈక్విటీ ఇష్యూల ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, పెట్టుబడిదారులకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లను మరింత పటిష్టం చేయాలని గడ్కరీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేట్లతో ఎన్‌బీఎఫ్‌సీలు నిధులను సమీకరించాలనీ తెలిపారు.
కొత్త ఆలోచనల కోసం పోర్టల్:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగానికి సంబంధించిన ఆలోచనలు, ఆవిష్కరణలను అప్‌లోడ్ చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఒక పోర్టల్‌ను ప్రారంభించారు. వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా ‘ఎంఎస్‌ఎంఇ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్’ దీన్ని ప్రారంభించారు.
పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశోధనలను పంచుకోవచ్చు. వీటిని సంబంధిత అధికారి సమీక్షిస్తారు. ఈ సమాచారమంతా ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని చెప్పారు. www.ideas.msme.gov.in పోర్టల్ ద్వారా ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశోధనలు సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ తరువాత ప్రభుత్వ నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తారు. వాటి సామర్థ్యం ఆధారంగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడతాయని నితిన్ గడ్కరి వివరించారు.
Tags: India, MSME, real estate, new portal for MSME, nitin gadkari