‘కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించాలి’

by Shamantha N |
‘కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించాలి’
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి తల్లిదండ్రులు బలవ్వడంతో అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ లేఖలో కోరారు. కరోనా వైరస్ అనేక కుటుంబాల్లో విషాదాన్ని, భవిష్యత్‌పై అంధకారాన్ని నింపుతున్నదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, లేదా పోషకులు మరణిస్తున్నారని, తద్వారా పిల్లల చదువు, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్న కుటుంబాలు ఎన్నో కనిపిస్తున్నాయని వివరించారు.

అలాంటి పిల్లలందరికి అండగా ఉండాలని, అది మన దేశ బాధ్యత అని తెలిపారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లలను నవోదయ విద్యాలయాల్లో చేర్చి ఉచితంగా విద్య అందించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గ్రామీణ పిల్లలకు విద్యను అందించాలనే తన భర్త కలలకు రూపంగా నవోదయ విద్యాలయాల నెట్‌వర్క్ ఏర్పడిందని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed