- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండియర్ విద్యార్థులను పాస్ చేయాలి.. ఇంటర్ బోర్డు వద్ద నిరసన
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన విధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా పాస్ చేయాలని తెలంగాణ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శనివారం ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంకట్ మాట్లాడుతూ.. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ విద్యార్థుల పరీక్షలపై స్పష్టతలేని ప్రకటనలు చేసి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులను వెంటనే పాస్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే విద్యార్థులను పాస్ చేసినట్టయితే ద్వితీయ సంవత్సర విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. గత సంవత్సరం కూడా ప్రమోట్ చేసే విషయంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని కోరారు.