- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
21న ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారాలు
దిశ, న్యూస్ బ్యూరో: ఈ నెల 21న ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం గ్రీవెన్స్‌లను నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డిఎస్.లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం ఈ గ్రీవెన్స్‌లను నిర్వహిస్తున్నప్పటికీ ఈ నెల 22న ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చినందున శనివారం రోజే ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన రివిజన్ ఫిటీషన్లు, ట్యాక్స్ అసెస్‌మెంట్ తప్పుల సవరణ, ఏరియర్స్, కోర్టు కేసుల పరిష్కారం, ఇతర ట్యాక్స్ సంబంధిత అంశాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పరిష్కరించుకునేందుకు వినియోగించుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.
Tags: Property tax fixes, 21st march, hyderabad, GHMC Commissioner DS Lokesh Kumar