ఉమ్మడి ఖమ్మంలో VRA లకు ప్రమోషన్స్

by Sridhar Babu |
Revenue Department
X

దిశ, బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు వీఆర్ఏలకు రెవెన్యూ శాఖలో నూతనంగా ప్రమోషన్స్ కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 13, 16 సంవత్సరాలుగా వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తోన్న 14 మందిని కలెక్టర్ గుర్తించి, వారిలో ఎక్కువ అనుభవం ఉన్నవారిని రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు మహబూబాబాద్ కలెక్టర్‌కు లేఖ రాశారు. వీరిలో బయ్యారం మండలంలోని తొమ్మిదిమంది వీఆర్ఏలకు చైన్‌మెన్‌లుగా, అటెండర్లుగా బాధ్యతలు అప్పగించారు.

వారిలో.. జినుగు శ్రీను ఆళ్లపల్లి మండలంలో చైన్‌‌మెన్‌గా, పేరెళ్లి రాంబాబుకు కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి చైన్‌మెన్‌గా, కొప్పెర వీరన్నకు సుజాత నగర్‌లో చైన్‌మెన్‌గా, గుడిసె దామోదర్‌కు కొత్తగూడెం ఎమ్మార్వో ఆఫీసులో అటెండర్‌గా, తుర్క వెంకన్నకు టేకులపల్లి చైన్‌మెన్‌గా, మక్కల శ్రీదేవి చండ్రుగొండ చైన్‌మెన్‌గా, బిట్ల శివనారాయణకు లింగగిరి చైన్‌మెన్‌గా, లకావత్ సేట్రాంకు పాల్వంచ చైన్‌మెన్‌గా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ధర్మాపురం వీఆర్ఏగా విధులు నిర్వహిస్తోన్న గంపలరాజుకు ఎక్కడ విధులు కేటాయించారనేది ఇంకా తెలియరాలేదు.

Advertisement

Next Story