- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'తెలంగాణ పథకాలు బీహార్ లోనూ అమలు చేస్తాం'
దిశ, తెలంగాణ బ్యూరో: మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని, బీహార్ లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ హుస్సేన్ హకీం పేర్కొన్నారు. మంత్రుల నివాసంలో మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చర్చించారు. ఈ సందర్భంగా యూనుస్ హుస్సేన్ హకీం మాట్లాడుతూ.. గత మూడ్రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూలంకషంగా పరిశీలించినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలను పరిశీలించామని, మైనారిటీల కోసం గురుకులాలు ఏర్పాటు, విదేశీ విద్య కోసం నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.
గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో లక్షా 81 వేల 398 మంది మైనారిటీలకు షాదీ ముబారక్ పథకం కింద రూ.1,402 కోట్లు విడుదల చేయడం ఒక చరిత్ర అన్నారు. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీలకు షాదీ ముబారక్ పథకం ద్వారా అందుతున్న నగదు ఎంతో మేలు చేస్తోందన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ను కేటాయించడం కూడా గొప్ప విషయం అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ ఖమరుద్దీన్, నాయకులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.
- Tags
- bihar