‘ఆ సిఫారసుల అమలుతోనే విద్యలో సామాజిక న్యాయం’

by  |   ( Updated:2021-01-08 10:27:51.0  )
‘ఆ సిఫారసుల అమలుతోనే విద్యలో సామాజిక న్యాయం’
X

దిశ, ముషీరాబాద్: కొఠారి కమిషన్ సిఫారసుల అమలు ద్వారానే విద్యలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఫ్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కొఠారి చెప్పినట్లుగా కామన్ స్కూల్ విధానంతోనే మానవీయ కోణంలో సమాన విద్య సాధ్యపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 4వ మహాసభలు సుందరయ్య విజ్జాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… ఆనాటి పరిస్థితుల నుంచి నేటి వరకు చూస్తే సరళీకృత ఆర్థిక విధానాలతో పేదలకు స్వచ్ఛమైన, నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు.

దేశంలో 37 శాతం మంది దళితులు, మహిళలు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన వారు ఇప్పటికీ విద్యకు దూరంగానే ఉన్నారని తెలిపారు. పిల్లలందరినీ పాఠశాలలకు తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. ఎన్డీఎ ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేస్తూ ఎన్ఈపీ-2020 పేరుతో ఫెడరలిజానికి తిలోదకాలిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి విద్యను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ, ఆర్థిక, విద్యా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు పూనుకోవాని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed