- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యా.. మమ్మల్ని ఆదుకోండి
దిశ, మహబూబ్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత మంది అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నేరెడిగామ్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన 15 కుటుంబాలకు చెందిన 80 మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వారంతా చేపలు పట్టేందుకు సంగంబండ ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క పథకం వీరికి చేరడం లేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు మాగనూరు తహసీల్దార్‌ను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. దాతలెవరైనా తమను ఆదుకోవాలని వలస వచ్చిన వారు కోరుతున్నారు.
Tags: Mahabubnagar,migrants,lockdown,no govt orders