- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు చేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నానాటికీ తీవ్రమవుతున్న తరుణాన త్వరలో నిర్వహించతలపెట్టిన సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్‌కు లేఖ రాశారు. కొవిడ్ రెండోదశ వీర విహారం చేస్తున్న వేళ విద్యా్ర్థులకు రక్షణ కల్పించడం కష్టతరమని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే పరీక్ష కేంద్రాలే కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారతాయని వివరించారు.
పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో విపరీతమైన భయాలు నెలకొని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి చదువు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖలో తెలిపారు. ఈ సంక్లిష్ట సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక గాంధీ వాద్రా లేఖలో పేర్కొన్నారు.