బేబి స్పీచ్‌కు ప్రియాంక ఫిదా..

దిశ, వెబ్ డెస్క్:

‘నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో.. అలాగే ఉండు.. ప్రపంచం కోసం నువ్వు మారడానికి ప్రయత్నిస్తే, అసలు నువ్వు అనే వాడివే ఉండవు.. కాబట్టి ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని నీలో నువ్వు మార్పులు చేసుకోవడం మానెయ్.. అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా అచీవ్ చేసేందుకు ట్రై చేయ్.. ఫెయిల్యూర్స్ ఎదురైతే అసలు ఎందుకలా జరిగిందనేది అనలైజ్ చేయ్’ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెప్పిన మాటలివి. కానీ ఇవే మాటలు ఓ చిన్నారి చెప్పడం విని ఆశ్చర్యపోయింది ప్రియాంక.

మనం సోషల్ మీడియాలో దేని గురించైనా వెతుకుతున్నప్పుడు.. కొన్ని వీడియోలను చూసి అలాగే ఆగిపోతాం. అలాంటి వీడియోనే ఇది అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది ప్రియాంక. తన ప్రసంగమే ఈ క్యూట్ గర్ల్ ద్వారా విని, దాని సారాంశం తెలుసుకోవడం నిజంగా చాలా బాగుందని తెలిపింది. పాపకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదన్న ప్రియాంక.. తనను ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తానని తెలిపింది.

 

Advertisement