- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో నాన్నతో గొడవ : ప్రియాంక
దిశ, వెబ్డెస్క్: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన తండ్రి గొప్ప స్నేహితుడని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 12వ ఏట ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన ప్రియాంక పదాహారేళ్లకు తిరిగిరాగా… తనను చూసి షాక్ అయ్యాడట తండ్రి అశోక్ చోప్రా. చిన్నపిల్లగా వెళ్లిన అమ్మాయి ఓ మహిళగా తిరిగిరావడంతో ఆశ్చర్యపోయారట. ఆ సమయంలో తను బిగుతైన డ్రెస్ ధరించి ఉండడంతో.. అబ్బాయిలందరూ తననే చూస్తుండడాన్ని తట్టుకోలేక అలాంటి బట్టలు వేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారట. దీంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగిందట. కానీ తప్పో, ఒప్పో ఏ పని చేసినా సరే నాతో చెప్పమని అనేవారట. ఒక విషయాన్ని చెప్తే దాని గురించి ఆలోచించి సమస్యను పరిష్కరించే వారని తెలిపింది. ఏదేమైనా నాన్న నా జట్టులోనే ఉండేవాడని తండ్రిని గుర్తు చేసుకుంది ప్రియాంక.
2013లో అశోక్ చోప్రా కాలేయ క్యాన్సర్తో చనిపోయిన విషయం తెలిసిందే. డాడి తన బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పుడూ చెప్తూనే ఉండే ప్రియాంక… తన చేతిపై ‘డాడీస్ లిటిల్ గర్ల్’ అని టాటూ కూడా వేయించుకుంది.
Tags: Bollywood, Priyanka Chopra, Ashok Chopra