- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్ లాంచ్ చేసిన ప్రియాంక..
దిశ, సినిమా : యాక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, ఆథర్‌గా నిరూపించుకున్న బ్యూటిఫుల్ ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో అడుగు వేసింది. న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉందన్న ప్రియాంక.. 2019 సెప్టెంబర్‌లో భర్త నిక్ జోనస్‌తో కలిసి రెస్టారెంట్ లాంచ్ రోజున తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఈ కార్యక్రమానికి తల్లి మధు చోప్రా కూడా హాజరు కాగా.. న్యూ ఎక్స్‌పరిమెంట్ థ్రిల్లింగ్‌గా ఉందని చెప్తుంది. ఈ నెల చివర్లో రెస్టారెంట్ సోనా ప్రారంభం కాబోతోందని, అందరూ కూడా ఈ అద్భుతమైన వంటకాలను టేస్ట్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది.
న్యూయార్క్‌లో ఇండియన్ రుచులను ఇంట్రడ్యూస్ చేయడం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నాను అంది ప్రియాంక. భారతీయ వంటకాల మీద ప్రేమతో ఈ ప్రయోగం చేస్తున్నానని, తను తిని పెరిగిన రుచులను అందరూ ఆస్వాదించాలనే ఉద్దేశంతో రెస్టారెంట్ తీసుకొస్తున్నట్లు చెప్పింది. హెడ్ చెఫ్ హరి నాయక్ మోస్ట్ డిలీషియస్ మెనూ తయారుచేశారని, ఇది అద్భుతమైన ఇండియన్ ఫుడ్ జర్నీలోకి తీసుకెళ్తుందని తెలిపింది. తన ఫ్రెండ్స్ మనీష్ గోయల్, డేవిడ్ రాబిన్ నాయకత్వం లేకుండా ఇది సాధ్యం కాదన్న ప్రియాంక.. డిజైనర్ మెలిస్సా బోవర్స్‌తో పాటు ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.