- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాక్సిస్ బ్యాంకులో ఈక్విటీ సంస్థ పెట్టుబడులు!
by Harish |
X
దిశ, సెంట్రల్ డెస్క్ :
గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్, దేశీయ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోందని తెలుస్తోంది.సుమారు 100 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.7,500 కోట్ల విలువైన యాక్సిస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసే అవకాశముంది. ఈ మొత్తం పెట్టుబడులు యాక్సిస్ బ్యాంకులో 5 నుంచి 8 శాతం వాటాకు సమానమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి ఇంకా చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్టు సమాచారం. ఇంతకుముందు బెయిన్ క్యాపిటల్ అనే అమెరికన్ ప్రైవేట్ పెట్టుబడి సంస్థ 2017లో 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యాక్సిస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసింది. యాక్సిస్ బ్యాంకుతో పాటు ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆర్‌బీఎల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఇండస్ ఇండ్ బ్యాంకులు సైతం పెట్టుబడుల సమీకరణలు చేపట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story