- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ చలాన్ల వసూలు.. రంగంలోకి ప్రైవేటు సంస్థలు
దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడైనా సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వసూలు చేయడం చూశాం, కానీ ట్రెండ్ మార్చి ట్రాఫిక్ ఉల్లంఘన దారుల నుంచి చలాన్లు వసూలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడానికి ప్రయివేటు వ్యక్తులను రంగంలోకి దించనుంది. ప్రస్తుతం ఈ కార్యకలాపాల కోసం కాంటాక్ట్‌లెస్ సిస్టమ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
పబ్లిక్ ఐ యాప్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనదారుని వాహనం రిజిస్ట్రేషన్ నంబరును గుర్తించి, జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ పద్దతి ద్వారా దాదాపు 50 శాతం జరిమానాలు వసూలు చేస్తున్నారు. చాలా వరకు చలానాలు ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు చేరడం లేదు. వాహనదారులు ఇచ్చిన చిరునామాలు సరైనవి కాదు. కాబట్టి చలానాలను పంపించడానికి, జరిమానాలను వసూలు చేయడానికి ప్రైవేటు సంస్థలను రంగంలోకి దించాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని బెంగళూరు ట్రాఫిక్ ప్లానింగ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కవిత కూడా ధ్రువీకరించారు.