- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాసెసింగ్ ఫీజులకు ప్రైవేట్ బ్యాంకుల ఆసక్తి
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కాలంలో కార్యకలాపాలు లేక, డిజిటల్ పెమెంట్స్, జీరో ఎండీఆర్ ఛార్జీల కారణంగా దేశంలోని పలు ప్రైవేట్ రంగ బ్యాంకులు నష్టపోయాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రైవేట్ రంగ బ్యాంకులు పలు మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. ఇప్పటికే వివిధ రకాల ప్రాసెసింగ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.
తాజాగా, కరోనా కాలంలో ఏర్పడిన నష్టాలను పూడ్చేందుకు ప్రైవేట్ రంగ బ్యాంకులు వివిధ ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడానికి అవసరమైన మార్గాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు, తక్కువ విలువతో ఎక్కువ లావాదేవీలను నిర్వహించే వాటిపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం గురించి బ్యాంకులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. యూపీఐ లావాదేవీలపైన పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్‌లపై ఎటువంటి ఛార్జీలు లేవు.
కానీ, పర్సన్ టూ పర్సన్ యూపీఐ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేసే యోచనలో ఉన్నట్టు, దీనిపై అవసరమైన పరిశీలనలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, బ్యాంకులు ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇవి ఒక్కో బ్యాంకు, వాటి విలువపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా, కరోనా తర్వాత లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయి.