- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ తీసుకోనున్న నరేంద్రమోడీ..?
దిశ, వెబ్‌డెస్క్ : రెండో దశ టీకా పంపిణీలో 60 ఏళ్లు పైబడినవారికీ వ్యాక్సిన్ వేయనున్న సందర్భంగా 70 ఏళ్లు నిండిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా టీకా వేసుకుంటారన్న చర్చ జరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌నూ విలేకరులు ప్రశ్నించారు. ఆయన అతి సాధారణ జవాబునిచ్చారు. లబ్దిదారులు వారికి కావల్సిన చోట వారే స్వయంగా వేసుకుంటారని దాటవేశారు.
కాగా, అదే సమావేశంలోనున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరో వివరణ ఇచ్చారు. మంత్రులందరూ చాలా వరకు డబ్బులు చెల్లించే టీకా వేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. పలుదేశాల్లో టీకా పంపిణీ మొదలైనప్పుడు నేతలు వ్యాక్సిన్ వేసుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. కానీ, ఇండియాలో తొలి టీకా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమక్షంలో వేసినప్పటికీ ఆయన వేసుకోలేదు. ప్రధానమంత్రీ ఇప్పటి వరకు టీకా వేసుకోకపోవడం గమనార్హం. రెండో దశలో ప్రధాన మంత్రి టీకా వేసుకుంటారని, అదే దశలో 50ఏళ్లు నిండిన అన్ని రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీకా వేసుకుంటారన్న వార్తలు గతనెలలో వచ్చాయి.