బీజేపీ ఎంపీ మృతి పట్ల ప్రధాని సంతాపం

by Ramesh Goud |
బీజేపీ ఎంపీ మృతి పట్ల ప్రధాని సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారికి గుజరాత్ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ బలైన విషయం తెలిసిదే. ఆగస్టులో కరోనా బారిన పడగా రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందించారు. తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతిచెందాడు. అయితే.. అభయ్‌ భరద్వాజ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ అభయ్‌ భరద్వాజ్‌ గొప్ప న్యాయవాది. ఆయన సమాజ సేవలో ముందంజలో ఉన్నారు. ఆయనకు జాతీయాభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువ. ఆయన కుటుంబానికి మరియు స్నేహితులకు నా సంతాపం. ఓ శాంతి’ అని మోడీ ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed