- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ నోటా 'కూరెళ్ళ' మాట
దిశ, రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి విద్యార్థులు, యువకులు, పుస్తక ప్రియులకు పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
5 వేల పుస్తకాలతో ప్రారంభమైన కూరెళ్ళ గ్రంథాలయం నేడు 2 లక్షల పుస్తకాలకు చేరుకోవడంతో ప్రధానమంత్రి విఠలాచార్యను అభినందిస్తూ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. ఈమేరకు వెల్లంకిలో విఠలాచార్య విలేకరులతో మాట్లాడుతూ.. విజ్ఞానం పెంపొందించడానికి తను ఎంతో కృషి చేస్తున్నానని అన్నారు. తాను ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.