అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

by Shamantha N |
అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ ప్రదేశ్‌ రోహ్‌తాంగ్‌లో అటల్‌ టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో.. 9.02 కిలోమీటర్ల పొడవుగా నిర్మించిన ఈ టన్నెల్‌… సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. మనాలీ నుంచి లాహోల్‌స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల.. మనాలీ నుంచి లఢక్‌‌లోని లేహ్‌ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా.. ఇది సొరంగం కావడం వల్ల దీన్లోకి మంచు రాదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు.. లఢక్, అక్సాయ్‌ చిన్‌ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed