- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ల్యాబ్‌లో చేశారా?.. విచారించనున్న అమెరికా
దిశ, వెబ్‌డెస్క్:
చైనాలోని వుహాన్ పరిశోధనా కేంద్రాల్లో కరోనా వైరస్‌ను ప్రత్యేకంగా సృష్టించి, జీవాయుధంగా మార్చారనే అంశం గురించి అమెరికా విచారించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇదే విషయంలో తాము చేయబోయే విచారణలో చైనా నిర్దోషిగా తేలితేనే అంతా బాగుంటుందని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో హెచ్చరించడం కొసమెరుపు.
అయితే కరోనా వైరస్ సహజంగా పుట్టిందా లేదా ఎవరైనా కావాలని ల్యాబ్‌లో తయారుచేశారా అనే అంశం గురించి ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ దీని కారణంగా అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడ మరణాలను, పాజిటివ్ కేసులను కట్టడి చేయడం ఇబ్బందిగా మారిపోయింది. వుహాన్‌లో వైరాలజీ ల్యాబ్ ఉండటం, దానికి దగ్గరల్లోని మాంసం మార్కెట్ నుంచి ఈ వైరస్ మొదటగా ప్రబలడం అనుమానాలకు తలెత్తుతోంది. అయితే ఈ అనుమానాలను వుహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి వీలైనంత త్వరగా చైనా ప్రభుత్వం కూడా రహస్యాలను బయటపెడితేనే అందరికీ మంచిదని మైక్ పాంపియో విలేకర్ల సమావేశంలో బహిరంగంగా అనడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా అత్యంత జనాభాగల చైనాలో కరోనా వల్ల కేవలం 3000 మంది చనిపోవడం, అమెరికాలో మాత్రం 20వేల మంది చనిపోవడం గురించి చైనా అధికారిక లెక్కల్లో తేడా ఉందన్న విషయం మీద కూడా మైక్ పాంపియో అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయం గురించి అమెరికాతో పాటు మిగతా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags: China, Wuhan, corona, Covid, Wet market, Virology lab, America, USA