- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడి కోసం కొడుకు బలి!
దిశ, వెబ్‌డెస్క్ : మూఢనమ్మకాల మత్తులో కన్నబిడ్డలను సైతం చంపుకునేందుకు వెనుకాడటం లేదు కొందరు తల్లిదండ్రులు. ఏపీలోని మదనపల్లి ఘటన మరువక ముందే కేరళ రాష్ట్రంలో మరో కిరాతకం ఆలస్యంగా వెలుగుచూసింది. ‘నేనే శివుడ్ని.. నా పిల్లలను తిరిగి బతికించుకుంటానని పద్మజ అనే మహిళా ప్రొఫెసర్ తాంత్రిక పూజల నెపంతో ఇద్దరు కూతుర్లను చంపుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఓ మూడు నెలల గర్భిణి తన ఆరేళ్ల కొడుకును ‘అల్లాహ్’ కోసం త్యాగం చేస్తున్నానని చంపేసింది. అక్కడ శివుడు, ఇక్కడ అల్లాహ్.. రెండు ఘటనల్లో మతం, దేవుడి పేర్లు వేరు వేరు. కానీ, మూఢ భక్తి మాత్రం ఒక్కటే’.
తాజాగా కేరళలోని పాలక్కడ్ జిల్లాలో మూడు నెలల గర్భిణి రాత్రి సమయంలో తన భర్త ఇద్దరు పిల్లలు పడుకున్న సమయంలో ఆరేళ్ల కొడుకు గొంతు నులిమి హత్యచేసింది.అనంతరం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. అల్లాహ్ కోసం తన కొడుకును త్యాగం చేసినట్లు వివరించింది. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపగా.. నేరం అంగీకరించిన ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మూఢ నమ్మకాల మత్తులో తల్లిదండ్రులు కన్న బిడ్డలను చంపుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా తీవ్ర ఆందోళనకు తెరతీస్తోంది. ఇలాంటి ఘటనలు నేటి ఆధునిక సమాజంలో చోటుచేసుకోవడం దురదృష్టకరంగా కొందరు భావిస్తున్నారు.