గుడ్‌న్యూస్.. గర్భిణులకు కరోనా వ్యాక్సిన్

by Anukaran |
Covid-19 vaccine wastage:
X

న్యూఢిల్లీ: గర్భిణులకూ కరోనా వైరస్ టీకా వేయవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. గర్భిణుల్లో టీకా ప్రయోజనాలుంటాయని, వారికి ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికైతే బాలింతలు టీకా తీసుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. త్వరలోనే గర్భిణులకూ టీకా వేయాలని గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది. చిన్నపిల్లలకు టీకాపైనా డాక్టర్ బలరాం భార్గవ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఒకే దేశం పిల్లలకు టీకా వేస్తున్నదన్నారు. 2-18 ఏళ్ల పిల్లలపై చిన్న అధ్యయనం చేపట్టామని, త్వరలోనే దాని ఫలితాలు వెల్లడవుతాయని వివరించారు. మరీ చిన్నపిల్లలకు టీకాలు అవసరమా? అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. టీకా వేసే సమయానికల్లా అందుకు సంబంధించిన డేటా మనదగ్గర ఉంటుందని, పిల్లలందరికీ టీకా ఉండదని భార్గవ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed