పంపనన్నాడు.. ప్రాణం తీసుకుంది

by Sumithra |
పంపనన్నాడు.. ప్రాణం తీసుకుంది
X

దిశ, రంగారెడ్డి: ఆమె ఏడు నెలల నిండు గర్భిణి. ఈ సమయంలో ఎవరైనా పుట్టింట్లో ఉండాలని అనుకుంటారు. ఆమెకు అలానే అనిపించిందేమో..తనను పుట్టింటికి పంపించాలని తన భర్తను అడిగింది. అయితే అందుకు తన భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సదరు గర్భిణి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా.. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో ఉంటున్న యూనిస్‌ఖాన్‌కు సదాశివపేటకు చెందిన షాహిదా బేగంతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లాలని తన భర్త యూనిస్ ఖాన్‌ను అడిగింది. అందుకు ఆయన ససేమిరా అనడంతో మనస్థాపం చెందిన షాహిదా బేగం.. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Next Story