గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన మున్సిపల్ చైర్మన్

by Aamani |
గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన మున్సిపల్ చైర్మన్
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బంగల్‌పేట్‌కు చెందిన గోదావరి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలు లేకపోవడంతో గాంధీచౌక్ వరకు నడుచుకుంటూ వచ్చింది. గమనించిన సహారా యూత్ సొసైటీ సభ్యులు 108 వాహనానికి కాల్ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో అటుగా వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ కారును ఆపి గర్భిణిని హాస్పిటల్‌కు తరలించారు.

tag; pregnant, nirmal municipal chairman, adilabad

Advertisement

Next Story

Most Viewed