రంగంలోకి రవితేజ.. మరో బ్లాక్‌బస్టర్‌‌ గ్యారంటీ

by Shyam |   ( Updated:2021-07-01 01:51:23.0  )
రంగంలోకి రవితేజ.. మరో బ్లాక్‌బస్టర్‌‌ గ్యారంటీ
X

దిశ, సినిమా : ‘క్రాక్’తో మాసివ్ హిట్ అందుకున్న మాస్ మహరాజ్ రవితేజ.. లేటెస్ట్‌గా తన 68వ చిత్ర షూటింగ్ మొదలెట్టాడు. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శక‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు(గురువారం) ప్రారంభ‌మైంది. ర‌వితేజ, ఇత‌ర కాస్టింగ్‌పై హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్యమైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేయగా.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆఫీస్ ముందు అటువైపు తిరిగి కూర్చున్న ర‌వితేజ ఏదో టైప్ చేస్తున్నట్టుగా కనిపించారు. ఇక ప్రభుత్వ అధికారిగా ఎవరో ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖతో పాటు డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ తదితర వస్తువులను ఈ పోస్టర్‌లో గమనించవచ్చు. మొత్తానికి ఈ క్రియేటివ్‌‌ పోస్టర్‌లోని రవితేజ ఇంటెన్స్ లుక్ ఆసక్తిని కలిగిస్తోంది.

కాగా రియ‌ల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథ సిద్ధం చేసుకున్న డైరెక్టర్.. ఈ మూవీని యూనిక్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ‘మ‌జిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. నాజ‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ, ఈ రోజుల్లో శ్రీ‌, మ‌ధుసూధ‌న్ రావు, సురేఖ వాణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story