హాలీవుడ్ రేంజ్‌లో నాగ్ యాక్షన్ స్టంట్స్..

by Jakkula Samataha |
హాలీవుడ్ రేంజ్‌లో నాగ్ యాక్షన్ స్టంట్స్..
X

దిశ, సినిమా: కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైనట్లు తెలిపారు డైరెక్టర్. ఎక్స్ రా ఏజెంట్‌గా ఉన్న నాగార్జున ఓ మిషన్‌‌ కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మారిపోయే పాత్రలో కనిపించబోతున్నాడని.. నాగ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తనను ఫిదా చేసిందన్నారు. ఈ చిత్రంలో హై ఆక్టేన్ స్టంట్స్‌తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నారన్నారని తెలిపారు. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్‌ రేంజ్‌లో ఉండే స్టంట్స్ చేసేందుకు వెనుకాడని నాగ్.. నిజంగా ఇన్‌స్పైరబుల్ స్టార్ అని కొనియాడారు.

హాలీవుడ్ కథలను తెలుగులోకి అడాప్ట్ చేసుకునే క్రమంలో అరుదుగా విజయాలు సాధించామన్నారు ప్రవీణ్ సత్తారు. హాలీవుడ్ స్టైల్‌ నుంచి స్ఫూర్తి పొంది.. మన నేటివిటీకి తగినట్లుగా కథను మలుచుకోవడం, నెరేటివ్ స్టైల్‌‌ను అవలంబించడంలో చిన్న ట్రిక్ ఉంటుందని.. అది ఫాలో అయిపోతే కచ్చితంగా సక్సెస్ సాధిస్తామన్నారు. తను ఊహించుకున్న పాత్రకు నాగ్ 100 శాతం న్యాయం చేస్తారని నమ్ముతున్నానని.. ఇంటెన్స్ ఎమోషనల్ ఆర్క్‌తో ఉన్న తన క్యారెక్టర్, ఇండస్ట్రీ అటెన్షన్‌ను క్యాచ్ చేస్తుందన్నారు. గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌తో ఉన్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటామని నాగ్ కూడా ధీమాగా ఉన్నారన్నారు ప్రవీణ్ సత్తారు.

Advertisement

Next Story