- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హిందూ దేవుళ్లను మొక్కం’.. వివాదంలో ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో/కరీంనగర్ ప్రతినిధి: ‘హిందూ దేవుళ్లను మొక్కం, విశ్వాసాలను పాటించం’ అంటూ పలువురు చేసిన ప్రతిజ్ణలో పాల్గొన్న వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. వెంటనే స్పందించిన ప్రవీణ్ కుమార్ తాను ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధూలికట్టలో సోమవారం స్థానికులు కొందరు బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు బుద్ధ వందనాన్ని పారాయణం చేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందనే ఆరోపణలు వచ్చాయి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దేవుళ్లను కించపరిచేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ణ చేశారని వీహెచ్‌పీ ఫైర్ అయింది. గురుకులాల విద్యాసంస్థల డైరెక్టర్ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. స్వేరోపై అనేక ఆరోపణ వస్తున్నా ఆయను డైరెక్టర్ గా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన స్ధానంలో ఐఏఎస్ అధికారిని నియమించాలన్నారు. స్పందించిన ప్రవీణ్ తానుకానీ, స్వేరోస్ గానీ, ఏ మతాన్ని కూడా కించపరిచేలా వ్యవహరించబోమని వివరణ ఇచ్చారు. జరిగిన సంఘటనతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే చింతిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, అన్ని పండుగలను చేసుకుంటామని తెలిపారు.