ముంబైలో ‘హంగామా’ చేసిన ప్రణీత

by Jakkula Samataha |
ముంబైలో ‘హంగామా’ చేసిన ప్రణీత
X

దిశ, సినిమా : కన్నడ సినిమా ‘పొర్కి’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. లేటెస్ట్‌గా బాలీవుడ్‌లోనూ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన భామ.. ‘హంగామా 2’, ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలను తన కిట్టీలో వేసుకుంది. కాగా ‘హంగామా 2’లో పనిచేయడం నాటకీయంగా ఉందనిపిస్తోందని తెలిపింది. యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న ఉత్తమమైన విషయం ఏదైనా ఉందంటే, నటులను వినయంగా ఉంచడమేనని చెప్పింది. నటిగా కొత్త ఇండస్ట్రీని అన్వేషించడం అద్భుతంగా ఉంటుందన్న ప్రణీత.. కొత్త భాష, కొత్త స్నేహితులు, కొత్త బృందంతో కలిసి పనిచేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చింది.

ఈ మధ్యే కామెడీ ఎంటర్‌టైనర్ ‘హంగామా 2’ షూటింగ్ కంప్లీట్ చేసిన హీరోయిన్.. తనకు 11 ఏళ్ల వయసునప్పుడు టీవీలో ‘హంగామా’ సినిమా చూస్తూ నవ్వుకోవడం ఇంకా గుర్తుందని, అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత మూవీ సీక్వెల్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. అదే ‘సినిమాలో ఉన్న బ్యూటీనెస్’ అని తెలిపిన ప్రణీత.. ఇక్కడ ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడింది. ఒక మూమెంట్‌లో ఇంట్లో కూర్చుని సినిమా చూడటం, నెక్స్ట్ మూమెంట్‌లో సీక్వెల్‌లో నటించడం.. తలచుకుంటే గొప్పగా ఉందని తెలిపింది. ‘హంగామా 2’ సినిమా మనం కన్న కలలు, కోరికలు నిజం అవుతాయని నిరూపించిందని ఆనందం వ్యక్తం చేసింది ప్రణీత.

Next Story

Most Viewed